Site icon NTV Telugu

Hyderabad: అంబర్‌పేట్‌లో 19 నెలల చిన్నారిపై కుక్కల దాడి.. తీవ్ర గాయాలు

Hyd Dog Attack

Hyd Dog Attack

నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా మరో చిన్నారిపై దాడికి పాల్పడ్డాయి. అంబర్‌పేట్‌లో 19 నెలల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో పాప శ్రీలక్ష్మికి చిన్నారి ముఖం, మెడ, చేతులు, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. చిన్నారిని నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు.

Read Also: YS Viveka Murder Case: వాచ్‌మెన్‌ రంగన్న మృతిపై సిట్ ఏర్పాటు.. రేపు రీపోస్టుమార్టం..!

వివరాల్లోకి వెళ్తే.. అంబర్‌పేట్‌లోని గోల్నాక డివిజన్ కమల నగర్‌లో కుక్కల దాడిలో 19 నెలల పాప శ్రీలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పాపను 108లో నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్‌కు తరలించి.. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇంటి ముందు ఆడుకుంటుండగా పాపపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు పేర్కొన్నారు. కుక్కల దాడి నుండి పాపను స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పోరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్.. గాయపడ్డ చిన్నారిని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌లో పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వీధి కుక్కలను ఇక్కడి నుండి తరలించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కార్పోరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అధికారులను కోరారు.

Read Also: TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా..?

అధికారుల నిర్లక్ష్యంతోనే చిన్నారులపై కుక్కల దాడి జరిగిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. చిన్నారులపై కుక్కల దాడి జరిగిందని చిన్నారి వైద్యానికి ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా చిన్నారి వైద్యానికి తనవంతు కూడా కృషి చేస్తానని తెలిపారు.

Exit mobile version