Site icon NTV Telugu

Crime News: 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి, ఆపై విషం పెట్టి..

Uttarpradesh

Uttarpradesh

Crime News: ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంటికి పొరుగున ఉండే 18 ఏళ్ల యువతిని కిడ్నాప్‌ చేసి.. అత్యాచారం చేసి ఆపై విషం పెట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా జెహనాబాద్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో 18 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టడంతో పాటు విషం కూడా ఇచ్చారని పోలీసులు తెలిపారు.

పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేసిన ఫిర్యాదు ప్రకారం.. జనవరి 1 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. పొరుగింటిలో ఉండే కమల్ అనే వ్యక్తి యువతిని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి అరవకుండా ఆమె నోరును గట్టిగా నొక్కి పట్టుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టి బలవంతంగా విషం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఆ యువతి కుటుంబసభ్యులు నిందితుడి ఇంటికి వెళ్లగా.. అతని కుటుంబసభ్యులు దారుణంగా కొట్టారని బాధితురాలి తల్లి ఆరోపించింది. జెహనాబాద్ పోలీసులు మొదట తన ఫిర్యాదును వినలేదని ఆమె జిల్లా ఎస్పీ ఎదుట వాపోయారు. తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని, పిలిభిత్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొంది.

Drunken Man: మత్తులో విద్యార్థి వీరంగం.. మూడు వాహనాల్ని ఢీ.. ట్విస్ట్ ఏంటంటే?

పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు కమల్, అతని సోదరుడు సంజు, సోదరి శీతల్, తల్లి మాయాదేవి, తండ్రి సత్యపాల్‌పై సంబంధిత సెక్షన్ల కింద మంగళవారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు జెహనాబాద్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌హెచ్‌ఓ) కొత్వాలి ప్రభాష్ కుమార్ తెలిపారు. నిందితులు ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version