Site icon NTV Telugu

Air India Plane Crash: విమానంలో భారతీయులే ఎక్కువ.. విదేశీయులు ఎంతమందంటే?

Ai Flight

Ai Flight

అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787-8 కూలిపోయింది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే క్రాష్ అయ్యింది. దట్టంగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు, 7 మంది పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో మాట్లాడారు. అహ్మదాబాద్ కు వెళ్లి సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించాలని ఆయన కోరారు.

Also Read:Kagiso Rabada: దక్షిణాఫ్రికా టెస్ట్‌ క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’ రబాడ!

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం (SVPIA) ప్రస్తుతం పనిచేయడం లేదు. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని విమాన కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Exit mobile version