Teen Queer Pranshu Suicide: సోషల్ మీడియా వచ్చాక సాధారణ ప్రజలు సైతం సెలబ్రిటీ ఇమేజ్ పొందుతున్నారు. ఒక్క వైరల్ వీడియోతో రాత్రి రాత్రికే స్టార్ అయిపోతున్నారు. ఇలా స్టార్ఇమేజ్ కోసం తహతహలాడుతూ సోషల్ మీడియాలో తమ లక్‌ను పరిక్షించుకుంటున్నారు. తమ టాలెంట్‌ను బయట పెడుతూ ఎన్నో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో అదృష్టం వరించి కొందరు స్టార్స్ అయిపోతుంటే.. మరికొందరు నెగిటివ్ కామెంట్స్‌తో అబాసు పాలు అవుతున్నారు. దానివల్ల పలువురు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఓ టినేజ్ యువకుడు కూడా ఈ జాబితాలో చేరాడు.
Also Read: Hyper Aadhi: హైపర్ ఆది పెళ్లి.. ఆమెతో ఏడడుగులు వేసిన జబర్దస్త్ కమెడియన్..?
సోషల్ మీడియాలో తన వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరించాలనుకున్న అతడికి చేదు అనుభవం ఎదురైంది. తన వీడియోకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూసి తట్టుకోలే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినికి చెందిన 16 ఏళ్ల ట్రాన్స్ జెండర్ ప్రన్షు మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. దీంతో తరచూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల మేకప్ వీడియోలు షేర్ చేస్తూండేవాడు. అంతేకాదు రీల్స్ కూడా చేస్తూ తన హావభావాలను పండించేవాడు. ఈ క్రమంలో అతడికి నెటిజన్లు నుంచి మంచి ఆదరణ కూడా దక్కింది. ఇన్‌స్టాలో ఫాలోయింగ్ కూడా పెరిగిపోవడంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా మారాడు. అయితే ఇటీవల దీపావళి పండగ సందర్భంగా ప్రన్షు చీర కట్టుకుని మేకప్ వీడియో షేర్ చేశాడు.
Also Read: Sriram: సక్సెస్ తలకెక్కని హీరో అల్లు అర్జున్.. నాకు ఇగో ఎక్కువ.. అందుకే
అయితే ఆ వీడియోకు దాదాపు 4000 పైగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అతడిపై అసభ్యకరమైన కామెంట్స్ రావడంతో ప్రన్షు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన అతడు శుక్రవారం రాత్రి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధవీకరించారు. ఈ విషయాన్ని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ నటుడు, ట్రాన్స్‌జెండర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు సోషల్ మీడియాలో వెల్లడించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రన్షు ఫొటో షేర్ చేస్తూ.. ఇప్పుడు మీరంతా హ్యాపీ. కన్నీరు ఆగడం లేదు. తన వీడియోలకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ చూసి ప్రన్సు ఆత్మహత్య చేసుకున్నాడు. 16 ఏళ్ల ప్రన్షు మేకప్‌లో తమకు ఎన్నో మెళకువలు నేర్పాడు’ అంటూ పోస్ట్ షేర్ చేశాడు.