16 Snakes and 32 snakes eggs In Home: మనలో చాలామంది పాము అంటేనే భయపడిపోయేవారు చాలానే ఉన్నారు. ఇక కొద్ది దూరంలో పాము ఉందంటే దరిదాపుల్లో కూడా కాపడకుండా వెళ్ళిపోతారు చాలామంది. మరోవైపు పాములను ఇంటి దేవుళ్ళుగా కొలిచేవారు కూడా లేకపోలేదు. ఇకపోతే ప్రస్తుతం వర్షాకాలంలో పాములు నీటి ద్వారా కొట్టుకోవచ్చి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే ఓ ఇంట్లో ఏకంగా 16 పాములు, 32 పాము గుడ్లు బయటపడటంతో ఆ సంఘటన సంబంధించిన విశేషాలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Prank Video: ఓరి మీ దుంపలు తెగ.. నవ్వించి చంపేస్తారా ఏంటి..?
బీహార్ రాష్ట్రంలోని కైరా గ్రామానికి చెందిన సందీప్ మహాతో అనే వ్యక్తి ఇంట్లో గత రెండు రోజుల నుంచి విషపూరితమైన నాగుపాములు కుప్పలు కుప్పలుగా బయటకు వస్తున్నాయి. కొండపోతగా కురిసిన వర్షం వల్ల వచ్చిన నీరు ఇంకిపోయిన తర్వాత ఆ ప్రదేశంలో పాములు కనపచ్చాయి. అయితే అలా ఇంట్లో పాములను ఒక్కొక్కటిగా చూడడంతో భయపడిపోయిన ఇంట్లోని వ్యక్తి వెంటనే అటవీ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. దానితో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే పాములను పట్టుకోవడానికి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Dog Breeding: ఇంట్లో కుక్కలను పెంచుకోవడమే కాదు.. ఇవి కూడా చేయాలి..
ఇక ఈ ఘటనలో అటవీశాఖ అధికారులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 పాములను పట్టుకొని వాటిని ఊరికి దూరంగా ఉన్న పొలాలలో వదిలిపెట్టారు. ఇకపోతే పాములతో పాటు మరో 32 పాము గుడ్లు కూడా దొరకడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇక పామలను, పాము గుడ్లను ఊరికి బయట వదిలేయడంతో అటవీశాఖ అధికారులకు అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.