Violation of Law : చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంది. నివాసం, ఉపాధి, సరిహద్దు చట్టాలను ఉల్లంఘించినందుకు సౌదీ అరేబియాలో వారం రోజుల్లో 15,328 మందిని అధికారులు అరెస్టు చేశారు. డిసెంబరు 22 నుంచి 28 వరకు వివిధ మార్గాల్లో చట్టాన్ని ఉల్లంఘించినందుకు అరెస్టు చేశారు. వీరిలో 8,808 మంది నివాస చట్టాలను ఉల్లంఘించినందుకు జైలు పాలయ్యారు. కాగా, అక్రమంగా సరిహద్దు దాటిన 4,038 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్మిక సంబంధిత చట్టాలను ఉల్లంఘించినందుకు 2,482 మందిని అరెస్టు చేశారు. సౌదీలోకి అక్రమంగా ప్రవేశించిన 552 మందిని అరెస్టు చేశారు. వీరిలో 48 శాతం మంది యెమెన్ స్థానికులు ఉన్నారు. ఇంకా వారిలో 47 శాతం మంది ఇథియోపియన్ పౌరులు, 5 శాతం ఇతర దేశాల నుంచి వచ్చిన వారే.
Read Also: Harrasment: లైంగిక ఆరోపణల నేపథ్యంలో హర్యానా క్రీడా శాఖ మంత్రి రాజీనామా
సౌదీ అరేబియా సరిహద్దులను ఉల్లంఘించే వారిపై.. వారికి సహాయం చేసే వారిపై కఠినంగా వ్యవహరించింది. సౌదీ అరేబియాలో సరిహద్దులను ఉల్లంఘించిన వారికి రవాణా, వసతి కల్పించడం 15 సంవత్సరాల వరకు శిక్షార్హులు. అలాగే, వారికి 2,60,000 సౌదీ రియాల్స్ జరిమానా విధించబడుతుందని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. లేనిపక్షంలో వారి ఆస్తులను జప్తు చేయడంతోపాటు చర్యలు తీసుకుంటామంది. ఎవరైనా అటువంటి ఉల్లంఘనలను గమనించినట్లయితే, మక్కా , రియాద్ ప్రాంతం నుంచి టోల్-ఫ్రీ నంబర్ 911ను సంప్రదించవచ్చని సూచించింది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు 996 నంబర్‌ను సంప్రదించి అధికారులకు సమాచారం అందిచవచ్చని తెలిపింది.