NTV Telugu Site icon

Republic Day: రిపబ్లిక్ డే వేడుకలకు ప్రత్యేక అతిథులుగా రైతు దంపతులు

Parede

Parede

Republic Day Parade: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా 1,500 మంది రైతు దంపతులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వాపం పంపించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ వేడుకలకు రైతు దంపతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Manipur: మణిపూర్ దాడుల్లో మయన్మార్ మిలిటెంట్ల హస్తం..

ఇక, దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రైతులను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపిక చేసి ఆహ్వానించామని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వాశాఖ అధికారి చెప్పుకొచ్చారు. వ్యవసాయోత్పత్తుల సంఘాల ప్రతినిధులు, ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి, చిన్న తరహా నీటిపారుదల పథకాల లబ్ధిదారులు వీరిలో ఉన్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా వీరికి విందు ఇవ్వనున్నారు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాలకు దాదాపు 500 మంది రైతులను ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.