Site icon NTV Telugu

KA Paul: చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ అమ్ముడు పోయాడు.. రూ.1500 కోట్ల డీల్‌ కుదిరింది..!

Ka Paul

Ka Paul

KA Paul: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అమ్ముడు పోయారు అని సంచలన ఆరోపణలు చేశారు.. దీని కోసం ఇద్దరి మధ్య రూ.1,500 కోట్ల డీల్ జరిగిందని చెప్పుకొచ్చారు.. ఎన్డీఏలో లేనని ఒకరోజు.. చేరుతున్ననని మరో రోజు చెబుతున్నాడు పవన్‌ కల్యాణ్‌ అని దుయ్యబట్టారు.. మరి రేపేమి అంటాడో వేచి చూడాలి అంటూ సెటైర్లు వేశారు.. ఇక, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించాను.. ఢీల్లీలో జరిగిన సమావేశం విజయవంతం అయ్యిందన్నారు కేఏ పాల్. .

Read Also: Mega Family: వరుణ్-లావణ్య పెళ్లి వేడుకలు మొదలయ్యాయి… అందరూ ఉన్నారు జనసేనాని తప్ప

మరోవైపు.. ఏ తప్పు చేయకపోతే నారా లోకేష్ ఎందుకు ఢిల్లీలో దాక్కున్నారు అని నిలదీశారు పాల్.. కాళ్ల వేళ్ల పడ్డా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ లోకేష్ కు దొరకలేదన్న విమర్శలు గుప్పించారు. కాగా, ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.. ఇదే సమయంలో నారా లోకేష్‌కి సైతం సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు ఏపీ సీఐడీ అధికారులు..ర అయితే, అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. విపక్ష టీడీపీపై కక్షపూర్తింగా వ్యవహరిస్తోందని.. అందులో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం విదితమే. మరోవైపు.. గతంలోనూ చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారు కేఏ పాల్.. చంద్రబాబు నుంచి రూ.1,500 కోట్లు పవన్‌ కల్యాణ్‌కు ముట్టా­యని.. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్లు అని, అందువల్లే పవన్‌ వెంట కాపులు లేరని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌ పేర్కొన్న విషయం విదితమే.

Exit mobile version