NTV Telugu Site icon

All India Police Commando Competition: నేటి నుంచి విశాఖలో ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు

All India Police Commando

All India Police Commando

All India Police Commando Competition: ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలకు ఆథిత్యం ఇచ్చేందుకు విశాఖపట్నం సిద్ధమైంది.. 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు-2024లు ఈ రోజు నుంచి విశాఖలో ప్రారంభం కానున్నాయి.. ముఖ్యఅతిథిగా ఏపీ హోం మంత్రి తానేటి వనిత హాజరుకానున్నారు.. పలు రాష్ట్రాలు నుంచి కేంద్ర పోలీసు బలగాలు ఈ పోటీల్లో పాల్గొంటాయి.. ప్రస్తుతం 14వ ఏఐపీసీసీ- 2024 కు ఆంధ్ర ప్రదేశ్ తరపునా గ్రేహౌండ్స్ ఆతిథ్యం వహిస్తుంది.. 14వ ఏఐపిసిసి-2024 పోటీల్లో 23 జట్లు పాల్గొనున్నాయి.. 23 జట్టుల్లో, 16 రాష్ట్రాల పోలీసులు జట్లు, 7 కేంద్ర పోలీసు సంస్థల జట్లు ఉన్నాయి.. పోటీల్లో సుమారుగా 750 నుంచి 800 మంది వరకు పాల్గొంటారు.. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పోటీసులు జరగనున్నాయి.. ఇక, ముగింపు వేడుకలకు ఏపీ డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి హాజరవుతారు.

Read Also: Anganwadis Chalo Vijayawada: చలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు..

కాగా, 2008వ సంవత్సరం నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి.. పలు రాష్ట్రాల నుంచి కేంద్ర పోలీసు బలగాలు పాల్గొనున్నాయి.. ప్రస్తుతం 14వ ఏఐపీసీసీ – 2024 కు ఆంధ్ర ప్రదేశ్ తరపునా గ్రేహౌండ్స్ ఆతిథ్యం వహిస్తుంది. ఇక, 13వ ఆలిండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ పోటీలు మనేసర్ లో జరిగింది.. 10వ ఏఐపీసీసీ-2018 పూణేలో నిర్వహించారు.. మరోవైపు.. కోవిడ్ కారణంగా 11, 12వ ఏఐపీసీసీ రద్దు చేశారు.. ఇటీవల జరిగిన 13వ ఏఐపీసీసీ పోటీల్లో విజేతగా ఐటీబీపీ (ITBP) నిలిచింది. ఏపీ గ్రేహౌండ్స్ జట్టు ఉత్తమ కాన్ఫిడెన్స్ కోర్స్ ట్రోఫిని.. 6వ ఏఐపీసీసీ పోటీలలో రన్నర్ ట్రోపీని గెలుచుకుంది. ప్రస్తుతం 14వ ఏఐపీసీసీ- 2024 పోటీల్లో 23 జట్లు పాల్గొంటున్నాయి.. ఈ పోటీల్లో ఐదు దశలు ఉంటాయి తమ స్థాయిలో వారిని సామర్థ్యం నైపుణ్యము.. ఓర్పును ప్రదర్శించి అత్యున్నత స్థానం కోసం ప్రయత్నిస్తాయి..