Site icon NTV Telugu

Vande Bharat Train : సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు

Vande Bharat

Vande Bharat

ప్రధాన మోడీ రేపు తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్‌ రైలును ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి మధ్య నడుపనుంది దక్షిణ మధ్య రైల్వే. అయితే.. ఈ వందే భారత్‌ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వెళ్తున్నాయి. అయితే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో ప్రయాణం సమయం 12 గంటల పడుతోంది. అయితే.. వందే భారత్ ట్రైన్ లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల్లోనే ప్రయాణించవచ్చు. దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచ్ లు 530 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది.

Also Read : Congress Leader: నాలుక కోసేస్తా.. రాహుల్‌ గాంధీకి శిక్ష విధించిన న్యాయమూర్తిని బెదిరించిన కాంగ్రెస్ నేత

1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్ లు ఉన్నాయి. ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్ లను పెంచే అవకాశం ఉంది. రేపు ఉదయం 11.30 నుంచి 12.05 లోపు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం కానుంది. ఈనెల 9 నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణికులకు ఈ వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. రేపటి వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు ఉండగా.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలుగా ఉంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలుగా ఉంది. వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోకలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Also Read : Sai Prasad Reddy: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. అసంతృప్తి వాస్తవమే..!

Exit mobile version