30 Years Industry Prudhvi Raj: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి.. ఫలితాలు ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి.. వైనాట్ 175 అంటూ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది.. ఇక, టీడీపీ-జనసేన కూటమి ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తోంది.. అయితే, ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన నేత, సినీ నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్.. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు సర్వే చేశాను అన్నారు.. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ సీట్లు రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఇక, ఈ ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ మంత్రి ఆర్కే రోజాదే అని ప్రకటించారు పృథ్వీ…
Read Also: Isha Ambani : టుట్టి ఫ్రూటీ, పాన్ పసంద్ అమ్మే కంపెనీని కొనుగోలు చేయనున్న ఇషా అంబానీ
అంతేకాదు.. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజా అక్రమాలపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు.. పవన్ కల్యాణ్‌పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలపై ఘాటుగా స్పందించారు పృథ్వీ.. పవన్ కల్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం, ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏమైనా నష్టం జరిగిందా? అని ఎద్దేవా చేశారు. నా దగ్గర బ్రౌన్ కలర్‌తో డైరీ ఉంది.. ఎమ్మెల్యేలు ఎంత డబ్బు సంపాదించారో నోట్ చేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ పిసినారి.. జేబులో నుండి పైసా తీయరు అని విమర్శించారు. ఇక, జనసేన పార్టీ వెంటనే మెగా ఫాన్స్ అని స్పష్టం చేశాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్..
