Site icon NTV Telugu

Rajasthan: మైనర్ బాలికను పెళ్లి చేసుకుని.. గదిలో బంధించి.. పది రోజులుగా అత్యాచారం..

Minor Girl

Minor Girl

రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి పది రోజులుగా ఆమె అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. రాజస్తాన్‌కు చెందిన 13 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అతడికి బాలిక కుటుంబ సభ్యులు సహాకరించారు.

Also Read: INDIA bloc: “ఇండియా కూటమి సమావేశంలో సమోసాలు కూడా లేవు”.. కాంగ్రెస్‌పై ఎంపీ విమర్శలు..

కుటుంబ సభ్యుల బలవంతంగా మేరకు పెళ్లి చేసుకున్న బాలికను భర్త ఓ గదిలో బంధించి పది రోజులుగా ఆమె లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి అతని అరాచకం తట్టుకోలేక బాలిక తన బాధనంతా తల్లితో చెప్పుకుంది. దీంతో బాధిత బాలిక తల్లి కూతురిని తీసుకుని అజ్మీర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. తన కూతురు బలవంతపు పెళ్లి, లైంగిక దాడి గురించి ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం పోక్సో సెక్షన్‌తోపాటు, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు అజ్మీర్‌ ఏఎస్పీ మహమూద్ ఖాన్‌ తెలిపారు. బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తామని, బలవంతంగా పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడిన నిందితుడ్ని అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read: Special Trains: తెలంగాణ నుండి అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైళ్లు..

Exit mobile version