NTV Telugu Site icon

Rajasthan: కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన 13 ఏళ్ల బాలిక.. బాత్రూంలోనే ప్రసవం

Stomach

Stomach

13 years old Girl Admitted in hospital with Stomach Pain and give Birth to baby : కడుపు నొప్పితో 13 ఏళ్ల బాలిక ఆసుపత్రిలో చేరింది. ఎన్ని మందులు వేసినా ఆమెకు కడుపు నొప్పి తగ్గకపోవడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించింది ఆమె తల్లి. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక తల్లికి షాక్ అయ్యే విషయం చెప్పారు. ఆమె గర్భవతి అని తేల్చారు. అయితే ఇక్కడ మరో షాకింగ్ ఘటన కూడా జరిగింది. ఆసుపత్రిలో చేరిన బాలిక సరైన చికిత్స అందించక ముందే బిడ్డకు జన్మనిచ్చింది. అది సాధారణంగా జరగలేదు. బాలిక బాత్రూమ్ కి వెళ్లినప్పుడు బిడ్డ బయటకు వచ్చేసింది. దీంతో ఆసుపత్రి సిబ్బందితో పాటు చుట్టుపక్కల వారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో జరిగింది.

Also Read: Gujrat: అద్దెకు ఇళ్లు తీసుకున్న ఒక అమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. కట్ చేస్తే షాక్

అసలు విషయంలో కి వెళితే జయాలాల్ అనే 13 ఏళ్ల బాలిక జైపూర్ లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. అయితే ఆమె తల్లికి తమ్ముడు వరుస అయిన వ్యక్తి ఆమెను బెదిరించి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో అభం శుభం తెలియని ఆ బాలిక అలానే ఉండిపోయింది. అయితే కొద్ది రోజులకు ఆమెకు కడుపు నొప్పి మొదలయ్యింది. ఎన్ని మందులు వేసినా తగ్గకపోయే సరికి ఆసుపత్రిలో చేర్పించడంతో ఆమె గర్భవతి అనే విషయం బయటపడింది.అయితే ఇంత తెలిసినా బాలిక తల్లి ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే బాత్రూంలో బిడ్డకు జన్మనివ్వడంతో ఆసుపత్రి సిబ్బందే ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను విచారించడంతో అసలు విషయం బయటపడింది. బాలిక తల్లి ఫిర్యాదు చేయనప్పటికి పోక్సో చట్టం కింద నిందుతుడిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

 

Show comments