Site icon NTV Telugu

Food Poisoning: బిర్యానీ ఇష్టంగా లాగించారు.. 13 మంది అస్వస్థతకు గురయ్యారు..

Biryani

Biryani

Food Poisoning: బిర్యానీ అంటే ఎవరైనా లొట్టలేసుకుంటూ మరీ తినేస్తారు.. ఆ బిర్యానీయే 13 మంది యువకులను ఆస్పత్రిలో చేరేలా చేసింది.. విశాఖలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గాజువాకలో కల్తీ ఆహారం తిని 13 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. స్థానికంగా ఉన్న మండి క్రూడ్ హోటల్లో బిర్యానీ తిన్న 13 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది.. బాధితులంతా విశాఖ పశ్చిమ నియోజకవర్గం 58వ వార్డు పరిధి ములగాఢ గ్రామానికి చెందిన యువకులు.. ఆదివారం రాత్రి భోజనం చేసి ఇంటికి వచ్చిన వారిలో 13 మందికి సోమవారం వేకువ జామున 4 గంటల ప్రాంతం నుంచి వాంతులు వీరేచనలు మొదలయ్యాయి. దీంతో.. వెంటనే వారిని కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నతర్వాత వారిని తీరిగి ఇంటికి తీసుకెళ్లారు.. అయితే, ఇంటికి వెళ్లిన అనంతరం మరల అదే పరిస్థితి.. దీంతో.. హుటాహుటిన సమీపంలోని సెయింట్ ఆన్స్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా ఇష్టంగా బిర్యానీ తిని 13 మంది యువకులు తీవ్ర అస్వస్థతకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Read Also: CM KCR Wife Shobha Rao: శ్రీవారి సేవలో సీఎం కేసీఆర్‌ సతీమణి..

Exit mobile version