NTV Telugu Site icon

Bank Holiday in August: ఆగస్టులో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏకంగా 13 రోజులు

Bank

Bank

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెల బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. సాధారణంగా, రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు. ఇది కాకుండా.. జాతీయ, రాష్ట్ర స్థాయి పండుగలలో కూడా బ్యాంకులకు హాలిడేస్ ఉంటాయి. స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పండుగలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే రాష్ట్ర స్థాయి పండుగలలో ఆ రాష్ట్రంలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆగస్టు నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులకు హాలిడేస్ ప్రకటించింది ఆర్ బీఐ.

READ MORE: UPI Payments: దేశంలో నిలిచిపోయిన యూపీఐ సేవలు.. కారణం ఏంటంటే?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఆగస్టు నెలలో మొత్తం 13 రోజులు (బ్యాంక్ సెలవులు 2024) బ్యాంకులకు సెలవులు కేటాయించింది. ఈ 13 రోజులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సేవలు నిలిపివేయడతాయి. ఈ నెలలో సెలవులు అధికంగా ఉన్నందున మీరు మీ బ్యాంక్ సంబంధిత పనులను సకాలంలో పూర్తి చేసుకోవడం మంచిది. ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో చూడండి.

READ MORE: LPG Price: పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు..ఎంతంటే.?

ఆగస్ట్ 3 (శనివారం): కేర్ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 4 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 8 (సోమవారం): టెండాంగ్ ల్హో రమ్ ఫాత్ పండుగ సందర్భంగా గ్యాంగ్ టక లో బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 10 (శనివారం): నెలలో రెండో శనివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 11 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 13 (మంగళవారం): ఇంఫాల్లో బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 15 (గురువారం): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 18 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 19 (సోమవారం): రక్షా బంధన్ సందర్భంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 20 (మంగళవారం): శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా కేరళలోని కొచ్చిలో బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 24 (శనివారం): నెలలో నాలుగో శనివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 25 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 26 (సోమవారం): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్యాంకులకు సెలవు