NTV Telugu Site icon

US: నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో విజేతగా నిలిచిన 12 ఏళ్ల ఎన్నారై బాలుడు

Us

Us

అమెరికాలో జరిగిన  నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో 12 ఏళ్ల భారతీయ సంతతి బాలుడు విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో బృహత్ సోమ భారీగా నగదు, ఇతర బహుమతులు గెలుచుకున్నాడు.

ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల ఇండియన్ -అమెరికన్ బృహత్ సోమ ఏడవ తరగతి విద్యార్థి. టైబ్రేకర్‌లో 29 పదాలను సరిగ్గా స్పెల్లింగ్ చేసి స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీని గెలుచుకున్నాడు. గురువారం జరిగిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో బృహత్ విజేతగా నిలిచాడు. నగదు మరియు ఇతర బహుమతులతో 50,000 కంటే ఎక్కువ సంపాదించాడు. మెరుపు రౌండ్‌లో 20 పదాలను సరిగ్గా పలకగలిగిన ఫైజాన్ జాకీని ఓడించి.. బృహత్ 90 సెకన్లలో 29 పదాలను సరిగ్గా స్పెల్లింగ్ చేయడంతో ఈ సంవత్సరం విక్టరీ సాధించాడు.

ఇది కూడా చదవండి: Vijayawada: విజయవాడలో భారీగా డయేరియా కేసులు.. రేపు నీటి టెస్టుల రిపోర్ట్..!

బృహత్ సోమ 30 పదాలలో 29 పదాలను సరిగ్గా ఉచ్చరించాడని నిర్వాహకులు తెలిపారు. ఛాంపియన్ టైటిల్‌ను సంపాదించడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. 2022లో హరిణి లోగన్ నెలకొల్పిన స్టాండింగ్ స్పెల్-ఆఫ్ రికార్డ్‌ను అధిగమించాడు. స్పెల్-ఆఫ్ సమయంలో లోగాన్ 26 పదాలలో 22 సరిగ్గా స్పెల్లింగ్ చేశాడని నిర్వాహకులు తెలిపారు. బృహత్ జ్ఞానశక్తిని ప్రశంసించారు.

స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో బృహత్ పాల్గొనడం ఇది మూడోసారి. అతను 2023లో 74వ స్థానానికి, 2022లో 163వ స్థానంలో నిలిచాడు. బృహత్ తండ్రి శ్రీనివాస్ సోమ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ.

ఇది కూడా చదవండి:Delhi: ఎయిరిండియా ఫ్లైట్ 20 గంటలు ఆలస్యం.. ప్రయాణికులకు చుక్కలు

స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ అనేది 1925లో ప్రారంభించబడింది. ఇదొక విద్యా కార్యక్రమం. కరోనా వైరస్ కారణంగా బీ 2020 లో రద్దు చేయబడింది. 2019లో ఎనిమిది మంది సహ-ఛాంపియన్‌లు ఉన్నారు. వారిలో ఏడుగురు భారతీయ-అమెరికన్‌లు. 1999 నుంచి పోటీలో ఇరవై తొమ్మిది మంది భారతీయ-అమెరికన్లు ఛాంపియన్‌లుగా నిలిచారు. ఈ సంవత్సరం పోటీలో పాల్గొనడానికి వచ్చిన 245 మంది స్పెల్లర్లలో అరవై ఐదు మంది స్పెల్లర్లు గతంలో స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో పోటీ పడ్డారు.