Site icon NTV Telugu

Supreme Court: “నాన్న, నాకు రూ. కోటి ఇస్తేనే మీతో ఉంటా”.. తండ్రికి 12 ఏళ్ల కుమార్తె డిమాండ్

Supremecourt

Supremecourt

Supreme Court: సుప్రీంకోర్టులో న్యాయవాదుల నుంచి న్యాయమూర్తుల వరకు అందరూ ఒక 12 ఏళ్ల బాలిక మాటలు విని విస్తుపోయారు. ఆ బాలిక తండ్రితో కలిసి జీవించడానికి రూ.1 కోటి డిమాండ్ చేయడంతో షాక్ అయ్యారు. వాస్తవానికి దంపతుల మధ్య వివాదానికి సంబంధించిన పిటిషన్‌ నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఈ పిటిషన్‌ను విచారించారు. ఆ బాలిక మాటలు విని ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే అమ్మాయి తల్లిని మందలించారు.

READ MORE: Fighter jets: మనకు కావాలి “5th జనరేషన్ ఫైటర్ జెట్స్”.. విదేశాల నుంచి కొనుగోలుకు యత్నం..

ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. వాస్తవానికి ఉత్తరాఖండ్‌కు చెందిన దంపతుల మధ్య వివాదం తలెత్తింది. వారికి ఓ కుమార్తె. ఈ వివాదంలో జిల్లా కోర్టు కూతురు బాధ్యతను తండ్రికి అప్పగించింది. జిల్లా కోర్టు ఈ ఉత్తర్వును హైకోర్టులో తల్లి సవాలు చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. జిల్లా కోర్టు తీర్పును తల్లి ధిక్కరించిందని, తన కూతరును అప్పగించలేదని తండ్రి సుప్రీంకోర్టుకు చేరుకున్నాడు. ఈ పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఆ 12 ఏళ్ల బాలికను విచారించిన సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్ విస్తుపోయారు. ‘నువ్వు నా తల్లిని వేధిస్తున్నావు, నా తల్లిపై కోర్టు ధిక్కార కేసు దాఖలు చేశావు. నాకు రూ. కోటి ఇవ్వండి, అలాగైతేనే తండ్రి వద్దకు వెళ్తా.’ అని ఆ బాలిక చెబుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పాఠశాల రికార్డులలో తల్లి తండ్రి పేరును సైతం తొలగించారు.

READ MORE: Pawan Kalyan: వీరమల్లును బాయ్ కట్ చేసుకోమనండి

ఇది విన్న సీజేఐ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని గట్టిగా మందలించారు. బాలిక మనసును పాడు చేయవద్దు, తండ్రిపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. అనవసరంగా ఈ వివాదంలోకి బిడ్డను లాగుతున్నారని మండిపడ్డారు. తల్లి కుమార్తె మనసులో తప్పుడు విషయాలు ద్వేషాన్ని నింపుతోందని చీఫ్ జస్టిస్ అన్నారు. ఈ అంశాన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. తండ్రి తరపున సీనియర్ న్యాయవాది పీఆర్ పట్వాలియా సుప్రీంకోర్టులో వాదించారు. తల్లి తరపు న్యాయవాది అనుభా అగర్వాల్ మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇరు పక్షాలు అంగీకరించిన తర్వాత కోర్టు చివరికి ఈ అంశాన్ని మధ్యవర్తికి అప్పగించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతు బహ్రీని మధ్యవర్తిగా నియమించింది.

Exit mobile version