Site icon NTV Telugu

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు..!!

Train

Train

Trains Cancelled: ఆపరేషనల్ కారణాల వల్ల విజయవాడ డివిజన్‌ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. విజయవాడ డివిజన్ మీదుగా వెళ్లే 12 రైళ్లు రద్దు కాగా.. ఒడిశా ప్రమాదం క్రమంలో మరికొన్ని రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి. పలు కారణాల వల్ల ఏపీలో ప్రయాణించే 12 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏడు రోజుల పాటు రద్దు చేసింది. విజయవాడ-రాజమండ్రి(07459), రాజమండ్రి-విజయవాడ(07460), రాజమండ్రి-విశాఖపట్నం(07466), విశాఖపట్నం- రాజమండ్రి(07467), కాకినాడ పోర్ట్ -విశాఖపట్నం(17267), విశాఖపట్నం- కాకినాడ పోర్ట్(17268), కాకినాడ పోర్ట్ -విజయవాడ(17258), విజయవాడ -కాకినాడ పోర్ట్(17257), గుంటూరు -విశాఖపట్నం(17239), విశాఖపట్నం -గుంటూరు(17240), విశాఖపట్నం- విజయవాడ(22701), విజయవాడ- విశాఖపట్నం(22702) ట్రైన్లను 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రద్దు చేశారు.

ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల కుటుంబసభ్యులకు సహాయం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ- 0866 2576924, రాజమండ్రి- 08832420541, సామర్లకొట-7780741268, నెల్లూరు-08612342028, ఒంగోలు-7815909489, గూడురు-08624250795, ఏలూరు-08812232267 నెంబర్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఏపీకి చెందిన పలువురు ప్రయాణికులు కూడా ఈ ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 70 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.

Read Also: Odisha Train Accident LIVE UPDATES: మాటలకందని మహా విషాదం.. ఘటనాస్థలానికి ప్రధాని మోడీ!

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. నేడు దాదాపు 50 రైళ్లను రద్దు చేయగా.. 38 రైళ్లను దారి మళ్లించారు. హౌరా-తిరుపతి(20889), హౌరా-సికింద్రాబాద్(12703), హౌరా-హైదరాబాద్(18045) రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-షాలిమార్(22850), వాస్కోడగామా-షాలిమార్(18048) రైళ్లను కటక్, అంగోల్ మీదుగా దారి మళ్లించనుండగా.. చెన్నై సెంట్రల్-హౌరా(12840) ట్రైన్‌ను జరోలి మీదుగా, బెంగళూరు-గువాహటి(12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా మళ్లించనున్నారు. హౌరా-పూరీ(12837), హౌరా-బెంగళూరు(12863), హౌరా-చెన్నై మెయిల్(12839), హౌరా-సంబల్‌పూర్(20831), సంత్రగాచి-పూరీ(02837), కన్యాకుమారి-హోరా(1266), చెన్నై సెంట్రల్-హౌరా(12842), బెంగళూరు- రైళ్లను నేడు రద్దు చేశారు.

నేడు గోవా-ముంబై వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. కానీ ఒడిశా ప్రమాదం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 230 మంది వరకు మరణించగా.. 900 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మూడు రైళ్లు ఢీకొనడంతో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరగ్గా… సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాత్రి కావడంతో సహాయకచర్యలు నెమ్మదిగా జరగ్గా.. ఉదయం నుంచి వేగంగా చేపడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇవాళ ఉదయం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Exit mobile version