Bijapur Encounter: బీజాపూర్-దంతేవాడ అంతర్- జిల్లా సరిహద్దులోని పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టు కేడర్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఎదురు కాల్పుల్లో ముగ్గురు బీజాపూర్ DRG సిబ్బంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. హెడ్ కానిస్టేబుల్ మోను వాడారి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోడిగా గుర్తించారు. అలాగే, మరో ఇద్దరు బీజాపూర్ DRG సిబ్బంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
Read Also: Pakistan: భారత్‌తో యుద్ధానికి అసిమ్ మునీర్ ఆరాటం, బీజేపీ స్నేహం కోసం ఇమ్రాన్ ఖాన్..
ఇక, SLR రైఫిల్స్, INSAS రైఫిల్స్, 303 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం నిరంతర సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. అదనపు బలగాలను, తగినంత బలగాలు మోహరిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టు ముట్టాయి. కాగా, బీజాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం మీడియాతో ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేం అన్నారు.
