NTV Telugu Site icon

TS IPS Transfers: తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌ల బదిలీ

Ts Ips

Ts Ips

తెలంగాణ (Telangana)లో 12 మంది ఐపీఎస్‌లు బదిలీ (IPS Transfers) అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్‌-2 ఐజీగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు బదిలీ కాగా.. ఆయన స్థానంలోకి తరుణ్‌ జోషి రానున్నారు. రామగుండం కమిషనర్‌గా శ్రీనివాసులు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా జోయల్‌ డేవిస్‌కు స్థానచలనం కల్పించారు.

సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్‌, టీఎస్‌ఆర్టీసీ ఎస్పీగా అపూర్వరావు, ట్రాన్స్‌కో డీసీపీగా గిరిధర్‌. జోగులాంబ డీఐజీగా ఎల్‌.ఎస్‌ చౌహాన్‌, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా సాధనా రష్మి, ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా ఆర్‌.గిరిధర్‌. పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా డి.మురళీధర్‌ నియమితులయ్యారు.

Show comments