Site icon NTV Telugu

YSRCP: 11వ జాబితా విడుదల చేసిన వైసీపీ..

Ycp

Ycp

త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 11వ జాబితాను విడుదల చేసింది. ఇందులో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇంఛార్జులను ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జుగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జుగా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ ఇంఛార్జుగా గొల్లపల్లి సూర్యారావు పేర్లను ప్రకటించింది.

Read Also: Sridhar babu: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుంది..

ఇప్పటికే బూత్ లెవెల్ స్థాయి అభ్యర్థలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎన్నికల సరళి ముగిసేలోపు ప్రతి గడపకు అయిదు సార్లు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని తెలియజేయాలని సీఎం జగన్ దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టటమే లక్ష్యంగా అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో ఇప్పుడున్న సిట్టింగుల పని తీరుపై పలు సంస్థలతో సర్వేలు నిర్వహించి.. వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తున్నారు.

Read Also: US: యూఎస్ ప్రజలకు బిగ్ అలర్ట్.. తక్షణమే రష్యా విడిచి వెళ్లాలని హెచ్చరిక

Exit mobile version