Site icon NTV Telugu

Suicides: 2021లో 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి

Parliament

Parliament

Suicides: 2021లో దేశంలో ప్రతిరోజూ 115 మంది రోజువారీ వేతన జీవులు, 63 మంది గృహిణులు తమ జీవితాలను ముగించుకున్నారని.. దేశంలో మొత్తం 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలియజేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నుంచి డేటాను పంచుకుంటూ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. గత ఏడాది మొత్తం 42,004 మంది రోజువారీ వేతన జీవులు, 23,179 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మొత్తంగా 20,231 మంది స్వయం ఉపాధి పొందేవారు, 15,870 మంది జీతభత్యాలు, 13,714 మంది నిరుద్యోగులు, 13,089 మంది విద్యార్థులు, 12,055 మంది వ్యాపారులు, 11,431 మంది ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసేవారుఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Covid Bells: మళ్లీ దడ పుట్టిస్తున్న కొవిడ్‌ కేసులు.. భారత్‌కు నాలుగో వేవ్ ముప్పు!

10,881 మంది వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్న వారు ఆత్మహత్య చేసుకున్నారు. 5,563 మంది వ్యవసాయ కార్మికులు, 5,318 మంది రైతులు లేదా సాగుదారులు, 4,806 మంది వ్యవసాయ కూలీల సహాయంతో లేదా వారి సహాయం లేకుండా సొంత భూమిని సాగుచేసుకున్న వారు, 512 మంది భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసే వారు అందులో ఉన్నారు. వ్యవసాయ కూలీల సహాయంతో లేదా లేకుండా కౌలు లేదా ఇతరుల భూమిపై ఆధారపడిన వారు కూడా 2021లో ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Exit mobile version