Forensic Science Lab: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు.. 1100 ఫైల్స్ దగ్ధం

  • ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు
  • 1100 కేసుల డాటా రికవరీ కోసం నాగాపూర్ ప్రత్యేక బృందం యత్నం
  • 1100 ఫైల్స్ దగ్ధం అయినట్లు గుర్తింపు
Fsl

Fsl

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో పదకొండు వందల కేసు ఫైల్స్ దగ్ధం అయినట్టు నాగాపూర్ ప్రత్యేక బృందం గుర్తించింది.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఉన్న సగం ఫైల్స్ దగ్దం అయినట్టు గుర్తించారు. 1100 కేసుల డాటా రికవరీ కోసం నాగాపూర్ ప్రత్యేక బృందం యత్నం చేసింది. కానీ, కేసుల డేటా రికవరీ కావడం కష్టం అని తేల్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Also Read:Mohan Bhagwat: ఆర్ఎస్‌ఎస్‌కు అధికారం అక్కర్లేదు.. మా లక్ష్యం అది కాదన్న మోహన్ భగవత్

×
×
Ad

హైదరాబాద్ మహా నగరంలోని నాంపల్లిలో గల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఈరోజు (డిసెంబర్ 7న) ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ల్యాబ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ల్యాబ్ లోనే పలు కీలక కేసుల్లో ఆధారాలు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ కంప్యూటర్లోనే కీలక కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఉన్న సగం ఫైల్స్ దగ్దం అయినట్టు అధికారులు తెలిపారు.