సిరియా రాజధాని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయ కాన్సులర్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ ఘటనలో ఇరాన్‌కు చెందిన సీనియర్ సైనిక సలహాదారుతో పాటు ఇతర సిబ్బంది మరణించారు. ఈ విషయాన్ని సిరియా అధికారులు, అక్కడి స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడి ఘటనలో కుప్పకూలిన కాన్సులర్ భవనం పక్కనే రాయబార కార్యాలయం కూడా ఉంది. ఈ దాడిలో చనిపోయిన ఇరాన్ మిలిటరీ సలహాదారు జనరల్ అలీ రెజా జెహ్‌దీ 2016 వరకు లెబనాన్, సిరియా దేశాల్లో ఖుద్స్ బలగాలకు అధ్యక్షత వహించారు. అయితే, ప్రస్తుతం దాడి జరిగిన ప్రదేశంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also: Udayagiri: ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపే మా లక్ష్యం..
అయితే, ఈ దాడి ఘటనపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ ఘటనను ఇరాన్ రాయబారి హొస్సేన్ అక్బరీ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయినట్లు తెలిపారు. భవనానికి కాపాలాగా ఉన్న ఇద్దరు పోలీసులు సైతం తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ ప్రతి దాడి ఎదుర్కోక తప్పదన్నారు.. ఇంతే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనను ప్రపంచమంతా ఖండించాలని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి కోరారు.