AP Govt: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, 2006 బ్యాచ్‌కు చెందిన డీఐజీలకు ఐజీలుగా ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కొల్లి రఘురామరెడ్డి, సర్వోశ్రేష్ట త్రిపాఠి, అశోక్ కుమార్, విజయ్ కుమార్, హరికృష్ణ, ఎం. రవి ప్రకాష్, రాజశేఖర్, కేవీ మోహన్‌రావు, రామకృష్ణకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, కేంద్రం డిప్యుటేషన్‌పై ఉన్న ఆర్కే రవికృష్ణ, జయలక్ష్మికి సైతం పదోన్నతులను కల్పించినట్లు తెలిపింది. వీళ్లకు జనవరి 1వ తేదీ నుంచి పదోన్నతలు వర్తించుతాయని ఆంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
IPS Promotions: ఏపీలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు..
Show comments