NTV Telugu Site icon

Virat Kohli Fan: వీరాభిమాని.. విరాట్ కోసం స్టేడియానికి సైకిల్ పై వచ్చిన బాలుడు

Virat Fan

Virat Fan

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కాన్పూర్‌లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. భారత ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు చాలా దూరం ప్రయాణించి స్టేడియంకు చేరుకుంటున్నారు. శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో విరాట్ కోహ్లి వీరాభిమాని దాదాపు 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కి స్టేడియానికి వచ్చాడు. ఆ వీరాభిమాని.. ఎవరో తెలుసా..? 10వ తరగతి చదువుతున్న విద్యార్థి.

Read Also: Ujjain Mahakal Temple: కూలిన ఉజ్జయిని మహాకాల్ ఆలయ గోడ.. శిథిలాల కింద పలువురు..!

10వ తరగతి చదువుతున్న ఓ క్రికెట్ అభిమాని భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తన స్టార్ ప్లేయర్ కోహ్లీ ఆడుతున్న ఆటను చూసేందుకు ఉన్నావ్ నుంచి కాన్పూర్ వచ్చాడు. వైరల్ అవుతున్న వీడియోలో యువ అభిమాని తన పేరు కార్తికేయ అని చెప్పాడు. తెల్లవారుజామున 4 గంటలకు ఉన్నావ్‌ నుంచి బయలుదేరి 11 గంటలకు స్టేడియానికి చేరుకున్నానని అన్నాడు. తల్లిదండ్రులు అడ్డుకోలేదా అని కార్తికేయను ప్రశ్నించగా.. వెళ్లేందుకు అనుమతించారని చెప్పాడు.

Read Also: Israel-Lebanon: లెబనాన్‌లోకి ప్రవేశించి దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధం.. సరిహద్దులో యుద్ధ ట్యాంకులు

అయితే కార్తికేయ కోరిక మాత్రం నెరవేరలేదు. ఎందుకంటే రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారీ వర్షం కారణంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట త్వరగా ముగిసింది. ఆట నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్లకు 107 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్ రహీమ్ (6*), మోమినుల్ హక్ (40*) ఉన్నారు.