NTV Telugu Site icon

Nellore: కొత్త అల్లుడికి పసందైన విందు.. 108 రకాలతో గుర్తుండిపోయేలా..

Nellore

Nellore

Nellore: అల్లుడా మజాకా… అన్నట్లు కొత్త దంపతులకు కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు అత్తింటివారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి 108 రకాల వంటకాలు చేసి వడ్డించి అత్తింటి వారి మర్యాదలు ఎలా ఉంటాయో రుచి చూపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఊసపల్లి గ్రామానికి చెందిన ఊసా శివకుమార్, శ్రీదేవమ్మ దంపతుల కుమార్తె శ్రీవాణిని నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన ఉమ్మడిశెట్టి శివకుమార్‌తో ఇటీవల వివాహమైంది. మొదటిసారి కొత్త అల్లుడు ఇంటికి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయాలని భావించాడు ఊసా శివకుమార్. మామ పేరు శివకుమార్‌ కావడంతో పాటు అల్లుడి పేరు కూడా అదే కావడం గమనార్హం.

Gun Fire Incident: రొంపిచర్ల కాల్పుల ఘటన.. దాడికి కారణం ఏమిటంటే?

కొత్త అల్లుడి కోసం ఏకంగా 108 రకాల వంటకాలను సిద్ధం చేశారు. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు అన్నీ ఆ మెనూలో ఉన్నాయి. ఈ మెనూలో మటన్‌, చికెన్, చేప, రొయ్యలు.. రసం, సాంబారు, పెరుగుతో పాటూ రకాల పిండివంటలు, స్వీట్లు ఉన్నాయి. ఓ టేబుల్‌పై ఈ వంటకాలను ఉంచి అల్లుడికి వడ్డించారు. విందు ఆరగింపు సమయంలో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. అత్తింటివారు ఏకంగా 108 రకాల వంటలతో అల్లుడికి విందు ఏర్పాటు చేయడంపై స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు చర్చించుకుంటున్నారు. ఆ వీడియోను నెట్టింట షేర్‌ చేయడంతో నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Show comments