NTV Telugu Site icon

Supreme Court: ఆ భూమి మొత్తం అటవీ శాఖదే.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court

Supreme Court

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కొంపల్లి శివారులోని సర్వే నెంబర్ 171లో గల 106 ఎకరాల భూమి అటవీ శాఖదే అని సుప్రీంకోర్టు తీర్పు వెలువడించింది. సర్వే నెంబర్ 171లో గల 106.34 ఎకరాల భూమిపై హక్కును కోరుతూ 1985లో మహ్మద్ అబ్దుల్ ఖాసిం అనే వ్యక్తి వరంగల్ డిస్ట్రిక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసులో తీర్పు 1994లో అటవీ శాఖకు అనుకూలంగా వెలువడగా.. సదరు వ్యక్తి హైకోర్టులో అప్పిలు పిటిషన్ దాఖలు చేశాడు.. ఆ అప్పీలు పిటిషన్ పై కూడా 2018లో హైకోర్టు అటవీశాఖకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.. ఇక, ఈ తీర్పుపై కూడా మహ్మద్ అబ్దుల్ ఖాసిం రివ్యూ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేయగా.. ఆ భూమి అతనికే చెందుతుందని 2021లో రాష్ట్ర న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

Read Also: IPL tickets: అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఏఐవైఎఫ్ డిమాండ్

కాగా, ఈ తీర్పుపై 2021లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటిషన్ ఫైల్ చేసిన సుప్రీంకోర్టు.. స్పెషల్ లీవ్ పిటిషన్ పై వాదనలు విన్న ఇద్దరు జడ్జిల ధర్మాసనం అటవీశాఖకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇక, ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేసిన అధికారులపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్ట ధర్మాసనం తెలిపింది. హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించి.. తనదిగా నిరూపించుకోలేని వ్యక్తికి 106 ఎకరాల అటవీ భూమిని గిఫ్టుగా ఇచ్చిందని ధర్మాసనం పేర్కొంది.