Site icon NTV Telugu

NIMS : నిమ్స్‌లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు…

Nims

Nims

నిమ్స్‌లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసి మరో ఘనత నిమ్స్‌ ఖాతాలో చేరింది. ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా సర్జరీలు చేశారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో డాక్టర్లు, సిబ్బందిని మంత్రి దామోదర రాజనర్సింహా అభినందించారు. 10 నెలల్లోనే వందకుపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన ప్రభుత్వ దవాఖానగా నిమ్స్‌ హాస్పిటల్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకూ 101 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశామని నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప బుధవారం ప్రకటించారు. ఇందులో 55 కిడ్నీలను బాధిత పేషెంట్ల కుటుంబ సభ్యులు డొనేట్ చేయగా, ఇంకో 46 కిడ్నీలను బ్రెయిన్ డెత్ కేసుల నుంచి సేకరించి పేషెంట్లకు అమర్చామని ఆయన తెలిపారు. ఇవిగాకుండా 4 లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు, ఒక హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ కూడా చేశామని వెల్లడించారు.

Bigg Boss: బిగ్ బాస్ ఇంట్లోకి వరద.. కంటెస్టెంట్స్ ని ఏం చేస్తారు?

Exit mobile version