NTV Telugu Site icon

Leg Chopped by Robbers: వందేళ్ల వృద్ధురాలి కాలు నరికిన దొంగలు.. ఎందుకో తెలుసా?

Old Woman

Old Woman

Leg Chopped by Robbers: వెండి ఆభరణాలు చోరీ చేసేందుకు ఓ దొంగల ముఠా ఆరుబయట నిద్రిస్తున్న వందేళ్ల వృద్ధురాలి కాలును నరికేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. వృద్ధురాలు ఆరుబయట నిద్రిస్తున్నప్పుడు ఒక దొంగల ముఠా వెండి వస్తువుల కోసం ఏకంగా కాలును నరికి వెళ్లిపోయారు. తెల్లవారుజామున ఇంటి యజమాని తెలియజేయడంతో తమకు తెలిసిందని బాధితురాలి మనవరాలు తెలిపింది. ఆమె వచ్చి చూసేసరికి వృద్ధురాలు ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నట్లు ఆమె పోలీసులకు వెల్లడించింది. ఒక వృద్ధ మహిళ కాళ్లు నరికి నగలు దోచుకెళ్లినట్లు ఉదయం మాకు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. బాధితురాలికి సుమారు 100 ఏళ్ల వయస్సు ఉంటుందని వారు వెల్లడించారు.

Mulayam Singh Yadav: ములాయం ఆరోగ్యం మరింత విషమం.. ఐసీయూలో చికిత్స

బాధితురాలిని గంగాదేవిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఒంటిపై పలు గాయాలున్నాయని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఈ మేరకు బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Show comments