100 Variety Foods: ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటికి వచ్చిన అల్లుడికి పెద్ద ఎత్తున అత్తమామలు మర్యాదలు చేయడం ఎక్కువగా జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో ఎక్కువగా కనబడుతుంది. ఇంటికి అల్లుడు వస్తున్నాడు అంటే చాలు.. అనేక ఏర్పాట్లను రెడీ చేసి అల్లుడికి రాచ మర్యాదలు ఎక్కువగా చూస్తుంటారు. కాకినాడలో ఇంటికి వచ్చిన కొత్త అల్లుడుకి అత్తమామలు 100 రకాల పిండి వంటలను చేసి వడ్డించారు. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళితే..
Samantha Dhulipalla: శోభిత చెల్లి సమంత.. నాగచైతన్యతో ఫోటోలు పోస్ట్
ఆషాడం ముగిసిన తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి వంద రకాల పిండి వంటలు చేసి అత్తమామలు అల్లుడికి మైండ్ బ్లాక్ చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడ నగరానికి చెందిన రవితేజకు గత సంవత్సరం సెప్టెంబర్ లో వివాహం జరిగింది. అయితే వివాహం తర్వాత ఆషాడ మాసం ముగియడంతో మొదటిసారి అల్లుడు అత్తారింటికి రావడంతో అత్తమామలు వందరకాల పిండివంటలతో అల్లుడికి భోజన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అత్తమామలు చేసిన 100 రకాల పిండి వంటలను చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేశాడు.