హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలో కుక్కల మరణాలు చర్చనీయాంశంగా మారింది. శాయంపేట మండలంలో సుమారు 100 పైగా కుక్కు చంపి పాతి పెట్టిన అంశం పైనా శాయంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సర్పంచ్ ఎన్నికల హామీల్లో భాగంగా వీధి కుక్కలను హతమార్చి పాతిపెట్టిన సర్పంచ్ ల పై కేసులు నమోదు చేశారు. శాయంపేట, ఆరేపల్లి రెండు గ్రామాల పరిధిలో ఘటన చోటుచేసుకుంది. రెండు గ్రామాల్లో 120కి పైగా వీధి కుక్కల ప్రాణాలు బలి తీసుకున్న గ్రామ పంచాయతీ సిబ్బంది.
Also Read:VaaVaathiyaar : జనవరి 14న అన్నగారు వస్తున్నారహో…
ఇప్పటికే 120కు పైగా పాతిపెట్టిన వీధికుక్కల కళేబరాలు వెలికి తీసిన పోలీసులు, వెటర్నరీ సిబ్బంది. వీధి కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. మొత్తం 9 మంది పై కేసులు నమోదు అయ్యాయి. కుక్కకాటు బాదితుల సంఖ్య పెరుగుతుంది.. ఆ వీధి కుక్కలకు స్కిన్ డిసీజ్ ఉండడం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారంటు గ్రామస్తులు చెబుతున్నారు. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పిటిషన్ మేరకు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
