NTV Telugu Site icon

100 Day Cough: కలకలం రేపుతోన్న వందల రోజుల దగ్గు వ్యాధి..

Cough

Cough

100 Day Cough: బ్రిటన్‌లో వందల రోజుల దగ్గు వ్యాధి కలకలం రేపుతోంది. దీన్ని అంటు వ్యాధిగా గుర్తించిన ఆరోగ్య నిపుణులు.. హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ వ్యాధి ముక్కు కారడం, గొంతు నొప్పితో మొదలై.. దగ్గు అధికమవుతుందని చెబుతున్నారు. దీని కారణంగా గొంతులో పుండ్లు, చెవిలో ఇన్ఫెక్షన్లకు గురయిన కేసులు బయటపడ్డాయి. ఓ దశలో మూత్రవిసర్జన ఆపుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాక్టీరియా కారణంగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మూడు, నాలుగు నిమిషాల పాటు తీవ్రమైన దగ్గు రావడం వల్ల వాంతులు, లేదా పక్కటెముకలు విరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితులు యూకేలో కనిపిస్తున్నాయి.

Read Also: Karthika Masam Last Monday: కార్తిక మాసం ఆఖరి సోమవారం.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

జూలై – నవంబర్ మధ్య 716 పెర్టుసిస్ కేసులు నమోదయ్యాయని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ఈ కోరింత దగ్గు గతేడాదితో పోలిస్తే 250 శాతం పెరిగిందని వెల్లడించింది. ముఖ్యంగా పిల్లులు, వృద్ధుల్లో ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లల్లో ఈ దగ్గు నివారించడానికి, మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి టీకాలు అవసరమని NHS హెచ్చరించింది. గర్భిణీలు టీకాలు వేయించుకోవాలని… తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. యూకేలో అందరూ సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. దగ్గు వచ్చినప్పుడు నోటికి ఏదైనా క్లాత్‌ అడ్డుపెట్టుకోవాలంటున్నారు. ఇది అంటువ్యాధిలా వ్యాపిస్తుందని… తుంపర్ల ద్వారా ఎటాక్‌ అవుతుందంటుని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అయితే ఈ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందని.. నివారించడం సాధ్యమేనని అంటున్నారు.