Site icon NTV Telugu

Rajya Sabha: ఎంపీలుగా విజయం.. 10 రాజ్యసభ సీట్లు ఖాళీ

Rajya

Rajya

ఆయా పార్టీల్లో ఉన్న ఆశావాహులకు మరో లక్కీ ఛాన్స్ దక్కనుంది. లోక్‌సభ ఎన్నికల పుణ్యమా? అంటూ రాజ్యసభలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో త్వరలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ రానుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్యసభ ఎంపీలు.. లోక్‌సభ ఎంపీలుగా గెలుపొందారు. దీంతో వారు రాజ్యసభ స్థానాలను వదులుకోనున్నారు. అసోం, బీహార్‌, మహారాష్ట్రల నుంచి రెండు చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర నుంచి ఒక్కో స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Adi Srinivas: ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది..

లోక్‌సభ ఎంపీలుగా గెలిచిన వారు వీరే..
కామాఖ్య ప్రసాద్‌ తాసా, సర్బానంద సోనోవాల్‌ (అసోం), మీసా భారతి, వివేక్‌ కుమార్‌ (బీహార్‌), ఉదయన్‌రాజే భోంస్లే, పీయూష్‌ గోయల్‌ (మహారాష్ట్ర), దీపేందర్‌ సింగ్‌ హుడా (హర్యానా), కేసీ వేణుగోపాల్‌ (రాజస్థాన్‌), బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ (త్రిపుర), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్‌)లు ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి గెలుపొందారు. రాజ్యసభ సెక్రటేరియట్‌ నుంచి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించనుంది.

ఇది కూడా చదవండి: Odisha Swearing-In: ఒడిశా సీఎం ప్రమాణస్వీకారానికి “పూరీ జగన్నాథుడికి” బీజేపీ తొలి ఆహ్వానం..

ఇదిలా ఉంటే ఆదివారం మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. మోడీతో పాటు 71 మంత్రులు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులకు సోమవారం శాఖల కేటాయింపు జరిగింది. రాజ్యసభ ఎంపీగా ఉంటూ పోటీ చేసి గెలిచిన పీయూష్‌ గోయల్‌కు వాణిజ్యం, పరిశ్రమలు, సర్బానంద సోనోవాల్‌కు షిప్పింగ్, నౌకాయానం, జలరవాణా, జ్యోతిరాదిత్య సింధియాకు కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, టెలికాం శాఖలు దక్కాయి.

Exit mobile version