IPL 2024: ఐపీఎల్ వేళ 10 జట్ల కెప్టెన్ల సక్సెస్ రేటు ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇక ఈ ఐపీఎల్ కొద్దీ రోజుల ముందే దాదాపు అన్ని ఫ్రాంచైజీలు తమ కెప్టెన్ లను అనౌన్స్ చేశాయి. ఇందులో కొన్ని టీమ్ లకు పాత కెప్టెన్లే నడిపించనుండగా.., మరి కొన్ని టీమ్ లకు కొత్త కెప్టెన్స్ వచ్చారు. ఇక ఐపీఎల్ లో పోటీ పడుతున్న పది జట్ల కెప్టెన్స్ ఎవరు..? వారి సక్సెస్ రేటు ఎంత..? లాంటి విషయాలు ఓ సారి చూద్దాం.
ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా చెన్నై సూపర్ కింగ్స్ కు మంచి పేరు ఉంది. ఇక ఈ సీజన్లో కూడా ధోనీ కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ కు వ్యవహరిస్తున్నాడు. ధోని ఇప్పటి వరకు చెన్నైకు 5 టైటిల్స్ ను అందించాడు. అదేమాదిరి 5 ఫైనల్స్‌లో కూడా ఓడిపోయాడు. ధోని కెప్టెన్సీలో మొత్తం ఐపీఎల్ మ్యాచ్ లలో సక్సెస్ రేటు 59.19గా ఉంది. ఐపీఎల్ 17వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు మరోసారి రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 2021లో పంత్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోగా.. 2022లో కూడా కెప్టెన్ గా కొనసాగాడు. ఆఫై కార్ యాక్సిడెంట్లో గాయపడి క్రికెట్ కి దూరమయ్యాడు. కాని, అయన తిరిగి ఢిల్లీ కెప్టెన్ గా బరిలో దిగుతున్నాడు. ఇకపోతే రిషబ్ పంత్ నేతృత్వంలో టీం ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. అయితే కెప్టెన్‌గా రిషబ్ పంత్ సక్సెస్ రేటు 55 శాతంగా ఉంది.
Also Read
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
Also Read: BRS Ex MLA Son: జూబ్లీహిల్స్ కారు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్
ఇక గుజరాత్ టైటాన్స్ గురించి చూస్తే.. టీం నుంచి హార్దిక్ పాండ్యా ముంబయి ఇండియన్స్ కు వెళ్లిపోవడంతో.. శుభ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్ అయ్యాడు. మొదటిసారి ఓ ఐపీఎల్ టీమ్ కు గిల్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే.. ఈ సీజన్ కు శ్రేయాస్ అయ్యర్ ను తిరిగి తమ కెప్టెన్ గా నియమించుకుంది. 2023 సీజన్ కు అయ్యర్ గాయంతో దూరమైన తర్వాత నితీష్ రాణా కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పటి వరకు అయ్యర్ కెప్టెన్సీ లో టీం 2 సార్లు ఫైనల్ వెళ్లిన.. రెండింట్లోనూ అయ్యర్‌కు ఓటమి తప్పలేదు. ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్ లలో కెప్టెన్ గా అయ్యర్ సక్సెస్ రేటు 50.9% గా ఉంది. ఇక లఖ్‌నవూ సూపర్ జెయింట్ విషయం చూస్తే.. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2020, 2021 ఐపీఎల్ సీజన్ లో రాహుల్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కి కెప్టెన్ గా ఉండగా.. ఆ తర్వాత 2022 నుంచి లక్నోకి కెప్టెన్ గా బాధ్యతలు చేపడుతున్నాడు. ఇతని సక్సెస్ రేటు 50.98 %.
Also Read: Amala Paul: తల్లి కాబోతున్న అమలా పాల్.. ‘టూ హ్యాపీ కిడ్స్’ అంటూ..!
ముంబయి ఇండియన్స్ పరిస్థితి చూస్తే.. 2024 ఐపీఎల్ లో పాండ్యా కొత్తగా కెప్టెన్ అయ్యాడు. ఇదివరకు గుజరాత్ ని 2022, 2023 సీజన్ లో వరుసగా ఫైనల్ కి చేర్చాడు. అందులో మొదటిసారి 2022లో విజయం సాధించగా.., 2023లో ఓటమి పాలయ్యాడు. పాండ్యా సక్సెస్ రేటు 73% గా ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ 2024 ఐపీల్ సీజన్ కు శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా ముందుండి నడిపించబోతున్నాడు. 2013లో శిఖర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయ్యాడు. ఈయన కెప్టెన్సీ సక్సెస్ రేటు 39.28% గా ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయం చూస్తే.. సంజు శాంసన్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. 2021 నుంచి ఇప్పటి వరకు శాంసన్ రాజస్థాన్ ని నడిపిస్తున్న అతనికి సక్సెస్ రేటు 48.88% గా ఉంది. ఇక 2022 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా ఫాఫ్ డు ప్లెసిస్ కొనసాగుతున్నాడు. అతని కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఫైనల్ చేరలేదు. డు ప్లెసిస్ మొత్తం 27 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయగా, సక్సెస్ రేటు 51.85%గా ఉంది. ఇక చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రస్తుత సీజన్ లో పాట్ కమిన్స్ మొదటి సారి కమిన్స్ ఐపీఎల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
తాజావార్తలు
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!