NTV Telugu Site icon

Fire Accident: చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది సజీవదహనం

China

China

China Fire Accident: చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది మంటలకు ఆహుతి అయ్యారు. వాయువ్య చైనాలోని షింజియాంగ్‌లో ఓ అపార్ట్​మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గురువారం రాత్రి జరిగిందీ దుర్ఘటన. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులకు.. మంటలను అదుపు చేసేందుకు మూడు గంటల సమయం పట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

MonKey In Jail: కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తి.. అసలు అది చేసిన తప్పేంటంటే

క్షణాల్లోనే మంటలు భారీగా చెలరేగడంతో అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించాయి. ఒక్కసారిగా వ్యాపించిన మంటలలో అపార్ట్‌మెంట్ వాసులందరూ చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మంటల్లో చిక్కుకుని 10 మంది సజీవ దహనం అవగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.