NTV Telugu Site icon

Prashanth Varma : “హను మాన్”చిత్రానికి ఏడాది.. అక్కడ టాటూ వేయించుకున్న ప్రశాంత్ వర్మ

Prashanth Varma

Prashanth Varma

Prashanth Varma : క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా లీడ్ రోల్ లోవచ్చిన హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచింది. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చి దాదాపు మొత్తం మీద 100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే సిక్వెల్ లో కీలకమైన హనుమాన్ పాత్రకు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ని తీసుకున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. సినిమా ఇంత సక్సెస్ ను అందుకోవడానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే ముఖ్య కారణం అని చెప్పాలి.. ఈయన సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. పలు షార్ట్ ఫిల్మ్స్‌తో నిరూపించుకున్న ఇతడు.. హీరో నాని నిర్మించిన ‘అ!’ మూవీతో దర్శకుడిగా మారాడు. మొదటి చిత్రంతోనే మంచి మార్కులు పడ్డాయి.. ‘కల్కి’, ‘జాంబీరెడ్డి’ లాంటి చిత్రాలతో భారీ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన సినిమా హనుమాన్.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నాడు.

Read Also:AP Govt: భవన నిర్మాణాలు, లేఔట్లకు అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగింత..

ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ స్థాపించి దాని నుంచి వరుసగా సినిమాలను ప్రకటిస్తూనే ఉన్నారు. PVCU నుండి 3వ ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా పలు సినిమాలు అలరించేందుకు బాక్సాఫీసు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ సంక్రాంతి సినిమాలతో గత ఏడాది సినిమాలు వచ్చి కూడా ఏడాది పూర్తయ్యిపోయింది. గత ఏడాది భారీ హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా ఒక ఊహించని విజయాన్ని సాధించి సంక్రాంతి సినిమాల్లో చరిత్ర సృష్టించింది. అయితే ఈ సినిమా సక్సెస్ ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మకి హీరోకి ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది. మరి ఈ ఏడాది అయ్యిన సందర్భంగా ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు. హను మాన్ సినిమా తనగుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అలాంటి సినిమాకి ఇపుడు ఏడాది పూర్తయ్యింది. మరి ఎమోషన్ ని తనతో జీవితాంతం ఉండేలా ఒక టాటూ వేయించుకున్నాను అంటూ తన చేతికి హనుమంతుని గదాదండం ప్రతీకని పచ్చ బొట్టు వేసుకొని షేర్ చేసుకున్నాడు. దీనితో ఈ పోస్ట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Read Also:PM Shram Yogi Maandhan Yojana: ఈ స్కీమ్ లో చేరితే.. ప్రతి నెల రూ. 3 వేలు పొందే ఛాన్స్!

Show comments