Site icon NTV Telugu

Kangana Ranaut: భారతీయుడి కంటే పాకిస్థానీలా మాట్లాడుతున్నాడు.. మమ్దానీపై కంగనా రనౌత్ విమర్శలు!

Kangana

Kangana

Kangana Ranaut: న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన డెమొక్రాటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను ఓడించి.. విజయం సాధించిన భారతీయ-అమెరికన్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేసింది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మమ్దానీ సాంస్కృతిక, మతపరమైన గుర్తింపును ప్రశ్నించారు. అతను భారతీయుడి కంటే పాకిస్తానీగా కనిపిస్తున్నాడని ఆమె ఆరోపించింది. అతని తల్లి మీరా నాయర్, భారత అత్యుత్తమ చిత్ర నిర్మాతలలో ఒకరు.. న్యూయార్క్‌లో ఉన్నప్పటికీ భారతదేశంలో పుట్టి పెరిగారని తెలిపింది. కానీ, మీరా నాయర్ కుమారుడు మమ్దానీ మాత్రం హిందూ మతాన్ని తుడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని ఒక పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Read Also: ISKCON : రాజమండ్రిలో జగన్నాథ రథయాత్ర శోభాయాత్రకు సర్వం సిద్ధం

ఇక, ప్రస్తుతం క్వీన్స్ నుంచి న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డెమోక్రటిక్ నేత జోహ్రాన్ మమ్దానీ.. ఎక్స్ వేదికగా ప్రైమరీ విజయంపై ఇలా రాసుకొచ్చాడు.. న్యూయార్క్ నగర మేయర్‌గా ఎన్నికైతే విస్తృత సంస్కరణలు చేపడతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే, న్యూయార్క్ నగరం యొక్క సంక్షోభాన్ని పరిష్కరించడానికి సరసమైన గృహ నిర్మాణానికి దూకుడుగా కృషి చేస్తామని వెల్లడించారు. తన ప్రచారంలో ప్రజా రవాణా వ్యవస్థను కూడా సమగ్ర పరుస్తానని హామీ ఇచ్చారు. అన్ని నగర బస్సులను శాశ్వతంగా ఛార్జీలు లేకుండా చేస్తానన్నారు.

Exit mobile version