Site icon NTV Telugu

Manipur: మణిపూర్ కొత్త సీఎంగా ఖేమ్‌చంద్ సింగ్..

Manipur Cm

Manipur Cm

Manipur: మణిపూర్ కొత్త సీఎంగా బీజేపీకి చెందిన యమునాం ఖేమ్‌చంద్ సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. జాతి ఘర్షణల కారణంగా గత రెండేళ్లుగా మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది క్రితం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మైయితేయిలు, కుకీల మధ్య ఏర్పడిన సంఘర్షణ కారణంగా గతేడాది సీఎంగా ఉన్న బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఆ రాష్ట్రంలో ఖేమ్‌చంద్ సింగ్ ను తదుపరి సీఎంగా ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శాననసభాపక్ష నేతా ఎన్నికైన తర్వాత, ఈ ప్రకటన వెలుబడింది.

రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు జాతి ఘర్షణల కారణంగా బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9, 2025న రాజీనామా చేసినప్పటి నుండి సీఎం పదవి ఖాళీగా ఉంది. ఎన్డీయే లోని ఇతర పార్టీల సభ్యుల మద్దతు ఖేమ్‌చంద్ సింగ్‌కు లభించాల్సి ఉంది. 60 మంది సభ్యులు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది బలం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రపతి పాలన గడువు మరో 10 రోజుల్లో ముగియాల్సి ఉంది. ఈలోపే సీఎం ఖరారయ్యారు.

యమునాం ఖేమ్‌చంద్ సింగ్ ఎవరు..?

మైతేయ్ వర్గానికి చెందిన ఖేమ్‌చంద్ సింగ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2017, 2022లో వరుసగా రెండు పర్యాయాలు సింగ్‌జమే అసెంబ్లీ స్థానం నుండి ఎన్నికయ్యారు.మార్చి 2017లో మణిపూర్ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీరెన్ సింగ్ మంత్రివర్గంలో మందిగా ఖేమ్ చంద్ పనిచేశారు.

Exit mobile version