Manipur: మణిపూర్ కొత్త సీఎంగా ఖేమ్‌చంద్ సింగ్..
- మణిపూర్ కొత్త సీఎంగా ఖేమ్‌చంద్ సింగ్..
- రాష్ట్రపతి పాలనకు తెర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్ కొత్త సీఎంగా బీజేపీకి చెందిన యమునాం ఖేమ్‌చంద్ సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. జాతి ఘర్షణల కారణంగా గత రెండేళ్లుగా మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది క్రితం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మైయితేయిలు, కుకీల మధ్య ఏర్పడిన సంఘర్షణ కారణంగా గతేడాది సీఎంగా ఉన్న బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఆ రాష్ట్రంలో ఖేమ్‌చంద్ సింగ్ ను తదుపరి సీఎంగా ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శాననసభాపక్ష నేతా ఎన్నికైన తర్వాత, ఈ ప్రకటన వెలుబడింది.
రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు జాతి ఘర్షణల కారణంగా బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9, 2025న రాజీనామా చేసినప్పటి నుండి సీఎం పదవి ఖాళీగా ఉంది. ఎన్డీయే లోని ఇతర పార్టీల సభ్యుల మద్దతు ఖేమ్‌చంద్ సింగ్‌కు లభించాల్సి ఉంది. 60 మంది సభ్యులు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది బలం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రపతి పాలన గడువు మరో 10 రోజుల్లో ముగియాల్సి ఉంది. ఈలోపే సీఎం ఖరారయ్యారు.
Also Read
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Snake bite: కానిస్టేబుల్‌ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
- Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
యమునాం ఖేమ్‌చంద్ సింగ్ ఎవరు..?
మైతేయ్ వర్గానికి చెందిన ఖేమ్‌చంద్ సింగ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2017, 2022లో వరుసగా రెండు పర్యాయాలు సింగ్‌జమే అసెంబ్లీ స్థానం నుండి ఎన్నికయ్యారు.మార్చి 2017లో మణిపూర్ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీరెన్ సింగ్ మంత్రివర్గంలో మందిగా ఖేమ్ చంద్ పనిచేశారు.
తాజావార్తలు
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్‌ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?