పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ హర్యానకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 రోజుల పాటు విచారించి.. అనేక విషయాలు రాబట్టారు. అనంతరం పలువురు యూట్యూబర్లను నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. తాజాగా జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు ఉన్న జస్బీర్ సింగ్‌ను బుధవారం నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి.
జస్బీర్ సింగ్ ‘జాన్ మహల్’ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి 1.1 మిలియన్లకు పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. జ్యోతి మల్హోత్రాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్ మద్దతుతో ఇతడు గూఢచర్యం చేసినట్లుగా పంజాబ్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ ఐఎస్ఐ కార్యకర్త షకీర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. జస్బీర్ సింగ్.. పాకిస్థాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు. ఇప్పటికే పాకిస్థాన్‌కు మూడు సార్లు వెళ్లి వచ్చినట్లుగా ఆధారాలు సేకరించారు. పాకిస్థాన్ అధికారి డానిష్‌తో కూడా సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు.
డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో జరిగిన పాకిస్థాన్ జాతీయ దినోత్సవ వేడుకలకు సింగ్ హాజరయ్యారని.. అక్కడ పాకిస్థాన్ ఆర్మీ సిబ్బంది, వ్లాగర్లతో సంభాషించినట్లుగా అధికారులు తెలిపారు. 2020, 2021, 2024లో మూడుసార్లు సింగ్ పాకిస్థాన్‌కు వెళ్లి వచ్చినట్లుగా కనిపెట్టారు.
ఇది కూడా చదవండి: Malaysia: భారత్ దౌత్య బృందాన్ని అడ్డుకునేందుకు పాక్ కుట్ర.. తిప్పికొట్టిన మలేషియా
పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలోని మహ్లాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్‌ను మోహాలీలోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ అరెస్ట్ చేసింది. నిఘా వర్గాల సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రాతో సింగ్‌కు స్పష్టమైన సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించిన తర్వాతే ఈ అరెస్ట్ చేసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: CM Chandrababu : అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు…
జ్యోతి మల్హోత్రా తర్వాత సింగ్‌కే పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. మొబైల్‌లో వారికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్లు ఉండడం కూడా సేకరించారు. ఇలా గూఢచర్యం చేసిన వాళ్లందరినీ గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో పంజాబ్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు .
