ఒక యువకుడు కర్రతో ఆటో డ్రైవర్ పై పదే పదే దాడి చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. డ్రైవర్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికి యువకుడు మాత్రం దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ మీరట్ జిల్లాలోని మావానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షారుఖ్ అనే యువకుడు ఆటో డ్రైవర్ సజ్జాదుద్దీన్ కు ఓ విషయంలో వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త ముదరడంతో యువకుడు ఆటో డ్రైవర్‌పై కర్రతో పదే పదే దాడి చేసాడు. దీంతో స్థానికులను భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ యువకుడు మాత్రం నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు.
మావానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.ఈ సంఘటనను అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
