డాక్టర్స్ డే రోజునే యువ వైద్యుల జంట ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైద్యులైన నికిల్ షేండకర్(27), అంకిత నికిల్ షేండకర్(26)లు ఇటీవలే వివాహం చేసుకుని పుణెలోని వావండి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. అంకిత మానసిక వైద్యురాలు కాగా.. నికిల్ ఆయుర్వేద వైద్యుడిగా చేస్తున్నాడు. ఇద్దరు వేరువేరు చోట్ల విధులు నిర్వహించుకుని వస్తుండగా ఫోన్లో వాగ్వాదం చేసుకున్నారు. దీంతో నికిల్ ఇంటికి వచ్చేలోపే అంకిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనిత మృతిని చూసిన భర్త అనంతరం ఆయన కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.