Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- పింప్రి చించ్వాడ్‌లో నకిలీ పోలీస్‌గా యువకుడు
- పెళ్లి కోసం మోసం
- ఈ పోస్టర్లను గమనించిన బీట్ మార్షల్
- అనుమానం రావడంతో పోలీసులు విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఒక ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి కోసం ఒక యువకుడు తాను పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యానని అబద్ధం చెప్పి, తన ఫోటోలతో బ్యానర్లు, పోస్టర్లు పెట్టించాడు. సమాచారం ప్రకారం, రిషికేష్ జాదవ్ అనే యువకుడు తనను మహారాష్ట్ర పోలీస్ దళంలో ఎంపికయ్యానని పేర్కొంటూ స్థానికంగా పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశాడు. ఆ పోస్టర్లలో అతను పోలీస్ యూనిఫాంలో ఉన్నట్లు, పోలీస్‌గా ఎంపికైనందుకు అభినందనలు తెలుపుతున్నట్లు చూపించారు.
ఈ పోస్టర్లను గమనించిన బీట్ మార్షల్‌కు అనుమానం రావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో రిషికేష్ జాదవ్ అసలు పోలీస్ శాఖలో ఎంపిక కాలేదని, అతను చెప్పిన సమాచారం పూర్తిగా అబద్ధమని తేలింది. పోలీసుల విచారణలో అసలు కారణం బయటపడింది. మంచి పెళ్లి సంబంధం కుదిర్చుకోవడానికి అత్తమామలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ నాటకమంతా చేశాడని అధికారులు తెలిపారు.
Also Read
పోలీస్ శాఖ పేరును దుర్వినియోగం చేయడం, అక్రమంగా బ్యానర్లు ఏర్పాటు చేయడం వంటి కారణాలతో అతనిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని, శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తాయని పోలీసులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!