మీకు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ సినిమాలో క్లైమాక్స్ గుర్తుందా? తనకు నచ్చని వ్యక్తిని తన కుమార్తె ప్రేమించిందని తెలిసి.. ఓ తండ్రి ఆ వ్యక్తి మర్మాంగాన్ని కోయిస్తాడు. ఇప్పుడు అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీకి చెందిన ఓ యువతి, యువకుడు లవ్ చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటామని ఇంట్లో చెప్పారు. కానీ ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. దాంతో తాము విడిపోయి బ్రతకలేమని ప్రేమజంట నిర్ధారించుకుంది.
Read Also: మరో వివాదంలో సన్నీ లియోన్
ఈ నేపథ్యంలో ప్రేమజంట ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు వారిపై కక్షగట్టారు. అదును కోసం వెయిట్ చేశారు. పెళ్లి తర్వాత ప్రేమజంట డిసెంబరు 22న తిరిగి ఢిల్లీకి చేరుకుంది. కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని రాజౌరీ పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువతి కుటుంబసభ్యులు మరింత కక్ష పెంచుకున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి యువకుడు బయటకు రాగానే రాజౌరి గార్డెన్ ఏరియాలో కిడ్నాప్ చేయించి తీవ్రంగా చితకబాదారు. అనంతరం అతడి మర్మాంగాన్ని కోసేశారు. ఈ ఘటనలో యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు అతడిని సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
