NTV Telugu Site icon

Yogi Adityanath: జమిలి ఎన్నికలకు యోగి మద్దతు.. మరికొందరు నేతలు ఏమన్నారంటే..?

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: దేశం మొత్తం ప్రస్తుతం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై చాలాా చర్చ నడుస్తోంది. కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 18-22 వరకు నిర్వహించడం.. తాజాగా ఈ రోజు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ చీఫ్ గా మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్‌ని నియమించింది.

ఇదిలా ఉంటే తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జమిలీ ఎన్నికలకు మద్దతుపలికారు. ఇది ప్రశంసనీయ ప్రయత్నమని, యూపీ ప్రజల తరుపున నేను ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని యోగి అన్నారు. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అనేది ప్రస్తుత అవసరం అని, ఇది స్వాగతిస్తున్నామని అన్నారు.

Read Also: September 5 Financial Changes: సెప్టెంబర్‌లో ఆర్థిక రంగంలో 5 మార్పులు..

జమిలి ఎన్నికలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్వాగతించారు. దీని వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, వీటిని సంక్షేమ పథకాలకు ఉపయోగించవచ్చని అన్నారు. 2024లో మళ్లీ ప్రధాని మోదీని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత చత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో కూడా జమిలీ ఎన్నికలను స్వాగతించారు, ఇది పాత ఆలోచనే అని అన్నారు.

‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ని కేంద్ర కుట్రగా శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎన్నికలను ముందు నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. జమిలి ఎన్నికలకు ఒకే కానీ, ఎన్నికలను నిష్పక్షపాతమైన ఎన్నికలను నిర్వహించాలనే మా డిమాండ్ ని వాయిదా వేయాలనే ఇలా చేశారని అన్నారు.

Show comments