Site icon NTV Telugu

Yogi Adityanath: సీఎం యోగికి ఐదేళ్ల బాలిక గిఫ్ట్.. ఏమిచ్చిందంటే..!

Up

Up

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చిన్నారులు కనిపిస్తే చాలు.. వారితో చక్కగా కలిసిపోతుంటారు. వాళ్లతో కాసేపు కాలక్షేపం చేసి ముచ్చటిస్తుంటారు. ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. తాజాగా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

శుక్రవారం ఉత్తర గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాన్ని యోగి సందర్శించారు. అక్కడ యోగి ఆదిత్యనాథ్‌‌ను ఐదేళ్ల బాలిక కలిసి బుల్డోజర్‌ బొమ్మను బహుమతిగా ఇచ్చింది. ఈ సంఘటన వేగంగా సోషల్ మీడియాను ఆకర్షించింది. కాన్పూర్‌కు చెందిన ఐదేళ్ల యశస్విని తన కుటుంబంతో కలిసి ఆలయానికి వచ్చింది. ఆలయం ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ముఖ్యమంత్రిని అనూహ్యంగా కలిసింది. కలిసిన వెంటనే బుల్డోజర్‌ బొమ్మను అందజేసింది. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇక ఆ బొమ్మను తీసుకున్నాక.. తిరిగి ఆ చిన్నారికే ఇచ్చేసి.. బాగా చదువుకోవాలని.. అలాగే బుల్డోజర్‌తో ఆడుకోవాలని యోగి సూచించారు.

ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ పాలన నడుస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. నేరస్థుల ఇళ్లపైకి యోగి ప్రభుత్వం బుల్డోజర్లను పంపిస్తుంటారు. ఆస్తులు ధ్వంసం చేయిపిస్తుంటారు. అందుకే ప్రతిపక్షాలు తరచుగా యోగిని ‘బుల్డోజర్ రాజ్’’ అని విమర్శిస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఐదేళ్ల బాలిక బుల్డోజర్ బొమ్మను బహుమతిగా ఇవ్వడంతో ఇంటర్నెట్‌ను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ చిన్నారి ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందో.. లేదంటే మామూలుగానే ఇచ్చిందో తెలియదు.

Exit mobile version