యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో మతకలహాలు, అల్లర్లకు చోటు లేదని ఆయన అన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అల్లర్ల రహిత ఉత్తర్ ప్రదేశ్ గా మారిందని ఆయన అన్నారు. యూపీలో కొత్త ప్రభుత్వం తన కార్యక్రమాలను మొదలుపెట్టిందని.. రెండు నెలలుగా మీరంతా యూపీలో జరుగుతున్న కార్యక్రమాలను చూస్తున్నారని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
రామ జన్మభూమి భూమి నిర్మాణం శాంతిపూర్వకంగా మొదలైందని ఆయన అన్నారు. హనుమాన్ జయంతి కార్యక్రమం శాంతిపూర్వకంగా జరిగిందని యోగీ అన్నారు. రంజాన్ మాసంలో అల్విదా దినం రోజున రోడ్డుపైన నమాజ్ లు జరిగేవని.. ప్రస్తుతం యూపీలో రోడ్లపై నమాజ్ లు జరగడం లేవని.. నమాజ్ చేసుకునే స్థానాలుగా మసీదులు, ఈద్గాలు ఉన్నాయని అన్నారు. మతపరమైన కార్యక్రమాలు మసీదులల్లోనే జరుగుతున్నాయని యోగీ అన్నారు. ఇది ఉత్తర్ ప్రదేశ్ లో తొలిసారి జరుగుతుందని అన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉన్న లౌడ్ స్పీకర్లు లేకుండా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. 70 వేలకు పైగా మైకులు ప్రార్థనా స్థలాల్లో ఉంచి ప్రజలకు ఇబ్బందులు కలుగచేస్తున్నాయని..వాటిన్నింటిని తొలగిస్తున్నామని అన్నారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్లు, అనారోగ్యంతో బాధపడేవారికి ఇబ్బందులు కలుగచేశాయని వీటన్నింటిని తీసేసి నయా ఉత్తర్ ప్రదేశ్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. చిన్న చిన్న విషయాలతో అల్లర్లు ఏర్పడుతున్నాయని.. ఇకపై మైకులు ఇప్పుడు అల్లర్లకు కారణం కావని.. అరాచకాలకు కారణం కాబోవని, ఇరువర్గాల మధ్య ఘర్షణకు కారణం కాబోవని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఈ విధంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రజల్లో మార్పు వచ్చిందని.. కొత్త భారతదేశం, కొత్త యూపీ తయారు అవుతుందని ఆయన అన్నారు.