NTV Telugu Site icon

Yogi Adityanath: యోగిని మూడు రోజుల్లో హతమారుస్తాం..

Yogi Adityanath

Yogi Adityanath

Death Threat To UP CM,ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని హెచ్చరికలు చేశారు.  ఆగస్టు 2న లక్నో కంట్రోల్ రూంలోని వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ బెదిరింపు మెసేజ్ వచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను  బాంబుతో హతమారుస్తామని ఆగంతకులు హెచ్చరించారు. మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని చంపేస్తామని హెచ్చరికలు చేశారు. అయితే ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నారు.

ఈ బెదిరింపు సందేశాలను ఎవరు పంపించారు.. ఎక్కడి నుంచి పంపించారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  బెదిరింపులు రాగానే హెల్ప్ లైన్ ఆపరేషన్ కమాండర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడ్డ వారిని అణ్వేషించే పనిలో ఉన్నారు యూపీ పోలీసులు. సుశాంత్ గోల్ఫ్ సిటీలో ఈ ఘటనపై కేసు నమోదు అయింది. నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని లక్నో పోలీసులు తెలిపారు.

Read Also: Tsrtc Independence Day Special Offers: ఆగస్టు15న పుట్టిన వారికి 12 ఏళ్లు వచ్చే వరకు ఉచిత ప్రయాణం

గతంలో కూడా యోగికి అనేక బెదిరింపులు వచ్చాయి. ఉత్తర్ ప్రదేేశ్ లో నేరాల అదుపు కోసం బుల్డోజర్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇది చాలా మంది అక్రమార్కులు, మాఫియాలో గుబులు పుట్టిస్తోంది. దీంతో పాటు కొన్ని ఉగ్రవాద సంస్థలు, వారికి సహకరించే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే యోగీకి బెదిరింపులు వచ్చి ఉంటాయని తెలుస్తోంది. స్వాతంత్య్ర వేడుకలకు కొన్ని రోజుల ముందు ఈ బెదిరింపులు రావడాన్ని యూపీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.