Site icon NTV Telugu

Dalai Lama: భారత్, చైనా కలిసి పనిచేస్తే ప్రపంచానికి మంచిది..

Dalai Lama

Dalai Lama

World Will Benefit If People Of India And China Work Together says Dalai Lama: చారిత్రాత్మకంగా బౌధ్ద దేశమైన చైనా, అహింసా-కరుణ ఆదర్మాలను కలిగిన భారత్ కలిసి పనిచేస్తే ఈ ప్రపంచానికే ప్రయోజనం అని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. రెండున్నర బిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఈ రెండు దేశాల ప్రజలు కలిసి పనిచేస్తే ఈ గ్రహం మొత్తానికి మంచిదని ఆయన అన్నారు. ఈ రెండు దేశాలు అంతర్గత శాంతిని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. కొన్ని సంవత్సరాలుగా భారత్ అనేక రంగాల్లో గొప్ప పురోగతిని సాధించిందని.. ముఖ్యంగా సైన్ అండ్ టెక్నాలజీలో పురోగమించిందని ఆయన అన్నారు. ప్రపంచశాంతిని సాధించడానికి, ప్రజలు తమలో తాము శాంతిని కలిగి ఉండాలని.. ఇది చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు.

Read Also: Uttar Pradesh: అంత్యక్రియల్లో కళ్లు తెరిచిన మహిళ.. షాకైన బంధువులు..

మానవుడు ‘కరుణ’ను కలిగి ఉండాలని దలైలామా అన్నారు. కరుణ అనేది మానవ స్వభావానికి విలువైన అంతర్గత వనరు అని.. మన వ్యక్తిగత శ్రేయస్సు , సమాజంలో సామరస్యానికి రెండింటికి పునాది అని ఆయన తెలిపారు. మనం పుట్టినప్పటి నుంచి మన తల్లి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది.. చాలా చిన్న వయసు నుంచి కరుణ అన్ని ఆనందాలకు మూలం అని తెలిపారు. అయితే పాఠశాలకు వెళ్లడం ప్రారంభించిన తర్వాత కరుణ అనేని మరసబారుతోందని అన్నారు. భారతీయ విద్యా విధానంలో ‘అహింసా’, ‘కరుణ’ను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎంతో స్ఫూర్తి పొందానని దలైలామా తెలిపారు.

టిబెటన్లు ఎప్పుడూ భారతీయ ఆలోచనలచే ప్రభావితం అవుతారని.. గతంలో టిబెటన్లు, భారతీయులను తమ గురువులుగా భావించే వారని.. టిబెట్ శరణార్థులను స్వాగతించినందుకు, భారత్ లో చదువుకోనిచ్చినందుకు భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనాలో కమ్యూనిస్ట్ పాలన ప్రారంభం అయిన తర్వాత దలైలామా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపుగా 6 దశాబ్ధాలుగా భారతదేశంలో అతిథిగా ఉంటున్నారు.

Exit mobile version